*కరువు నేపథ్యంలో ప్రజలకు రేషన్ ద్వారా 12 రకాల వస్తువులను అందజేయాలి*

*తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం.జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్*
నమస్తే భారత్ షాద్ నగర్: అక్టోబర్ 30: శుక్రవారం: వెళ్లి నిన్ను ప్రభావంతో తీవ్ర కరువు సంభవించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ప్రతినెల 50 కేజీల బియ్యం 12 రకాల నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మరియు షాద్నగర్ డివిజన్ కన్వీనర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర వర్క్ షాప్ లో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఈ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీలో చర్చించినట్లు ఆయన తెలిపారు అదేవిధంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పేదలందరికీ ప్రతినెల 50 కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేయాలని శ్రీను నాయక్ కోరారు, కరువు నేపథ్యంలో పంటలు పండక వ్యవసాయ కార్మికులకు నిరుపేదలకు పని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి కరువు బియ్యం సరుకులు పంపిణీ చేయాలని హెచ్చరించారు. కరువు మండలాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. వాస్తవంగా వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కరువు మండలాల సంఖ్య పెంచాలని, వి బి జి రామ్ జి చట్టం ప్రకారం.ప్రతి గ్రామంలో 200రోజుల పనిదినాలు కల్పించి,800 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.జాబ్ కార్డు లేని పేదలందరికీ జాబ్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి ₹12,000 ఇస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. దళితులు ,గిరిజనులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారని వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
200రోజులపనిదినాలు,800వేతనం ,పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 6వ తేదీన ఛలో హైదరాబాద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.



