ePaper
Saturday, October 3, 2026
ePaper
Homeతెలంగాణరాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన మెనూను ప్రారంభించిన గుగులోతు కవిత

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన మెనూను ప్రారంభించిన గుగులోతు కవిత

📰 Generate e-Paper Clip

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన మెనూను ప్రారంభించిన

గుగులోతు కవిత

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో వెంకటియ్య తండా అంగన్వాడి సెంటర్ లో పోషణ్ అభియాన్ – పోషణ మాసం కార్యక్రమాన్ని విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుగులోతు కవిత అంగన్వాడి టీచర్ గ్రామ సర్పంచ్ ఉపసర్పంచి గ్రామ కార్యదర్శి గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుగులోతు కవిత మాట్లాడుతూ.సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు మరియు కిశోర బాలికలకు పౌష్టికాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, సమతుల్య ఆహారం వంటి అంశాలపై గుగులోతు కవిత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబంలో పోషకాహారంపై అవగాహన పెంపొందించడం ద్వారా చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు, మహిళల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచవచ్చని అన్నారు. పిల్లలకు సరైన పోషకాహారం అందించడం తల్లిదండ్రుల బాధ్యత అని, ఆరోగ్యకరమైన ఆహార పు అలవాట్లను చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!