ePaper
Saturday, October 31, 2026
ePaper
Homeతెలంగాణధర్మరావుపేటలో వీవో భవన నిర్మాణానికి భూమిపూజ

ధర్మరావుపేటలో వీవో భవన నిర్మాణానికి భూమిపూజ

📰 Generate e-Paper Clip

ధర్మరావుపేటలో వీవో భవన నిర్మాణానికి భూమిపూజ

ఖానాపురం, అక్టోబర్ 29 (మల్లేష్ నమస్తే భారత్):

ఖానాపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో రూ.10 లక్షల నిధులతో
మహిళా సంఘం వీవో భవన నిర్మాణానికి నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ మహిళా సంఘాల సభ్యులతో కలిసి గురువారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక చొరవతో మహిళా సంఘం వీవో భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. భవన నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ముదురు కుమారస్వామి, ఉపసర్పంచ్ కొనుకటి రాజు, నాయకులు జలేంద్రచారి, కొనకటి రామ్‌రెడ్డి, సత్యనారాయణ, గోనె రవీందర్, కొనుకటి మోహన్, ఎర్రబెల్లి వెంకటేశ్వర్లు, వెంకన్న, సోమయ్య, జంగిలి వెంకటేశ్వర్లు, ధరంసోత్తు బాలు, బాలకృష్ణ, భూక్య లాలు, సీఏలు రేణుక, ప్రమీల, సమత, వీవో అధ్యక్షులు సుకన్య, శ్రీలత, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!