ePaper
Sunday, July 26, 2026
ePaper
Homeఎడిటోరియల్మానవ హక్కుల పరిరక్షణకు మరింత బలం

మానవ హక్కుల పరిరక్షణకు మరింత బలం

📰 Generate e-Paper Clip

మానవ హక్కుల పరిరక్షణకు మరింత బలం

-విఐపి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌లో చేరిన ప్రముఖ న్యాయవాదులు

-టోలిచౌకి ప్రధాన కార్యాలయంలో సభ్యత్వ కార్యక్రమం

-వ్యవస్థాపకులు ఎండి జహంగీర్ సమక్షంలో అధికారిక ఆహ్వానం

-వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ అడ్వకేట్ల చేరిక

-ఉచిత న్యాయ సహాయ సేవల విస్తరణకు కృషి

-రాజ్యాంగ హక్కుల పరిరక్షణే సంస్థ లక్ష్యమన్న నాయకత్వం

-సామాజిక న్యాయం కోసం న్యాయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని కొత్త సభ్యుల హామీ

కుత్బుల్లాపూర్, జూలై 8 ( నమస్తే భరత్ ): మానవ హక్కుల పరిరక్షణతో పాటు వెనుకబడిన, బలహీన వర్గాలకు న్యాయ సహాయం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విఐపి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌కు పలువురు ప్రముఖ న్యాయవాదులు బుధవారం అధికారికంగా చేరారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఉన్న అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ న్యాయవాది ఎండి జహంగీర్, నాయకులు మున్నా, జాతీయ కార్యదర్శి షేక్ అహ్మద్ సమక్షంలో నూతన సభ్యులకు సభ్యత్వ పత్రాలు అందజేసి సంస్థలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ మౌనిక సమర్ల, అడ్వకేట్ గణేష్ కల్వకోలు, అడ్వకేట్ బొమ్మల శ్రవ్య, అడ్వకేట్ భార్గవి రేగు, అడ్వకేట్ నిహారిక ఎరువ అసోసియేషన్‌లో సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎండి జహంగీర్ మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన న్యాయవాదులు సంస్థలో చేరడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. వారి సేవలతో పేదలు, బాధితులు, వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు, మానవ హక్కుల ఉల్లంఘనలపై పోరాటాన్ని మరింత బలోపేతం చేయగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జాతీయ కార్యదర్శి షేక్ అహ్మద్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి న్యాయ నిపుణులు అసోసియేషన్‌లో చేరడం సంస్థపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధనలో సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. నూతనంగా సభ్యత్వం పొందిన న్యాయవాదులు మాట్లాడుతూ, మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, ఉచిత న్యాయ సహాయం అందించడంలో తమ న్యాయ పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తూ సంస్థ ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!