ePaper
Saturday, October 24, 2026
ePaper
Homeఎడిటోరియల్నీరు,విద్యుత్ పొదుపుగా వాడుకొని విపత్తును ఎదుర్కొందాం

నీరు,విద్యుత్ పొదుపుగా వాడుకొని విపత్తును ఎదుర్కొందాం

📰 Generate e-Paper Clip

నీరు,విద్యుత్ పొదుపుగా వాడుకొని విపత్తును ఎదుర్కొందాం

వైవిధ్యమైన పంటల సాగుతో నేలను సంరక్షించుకుందాం

నల్లు సుధాకర్ రెడ్డి ఆత్మ చైర్మన్

నమస్తే భారత్ :-డోర్నకల్

తీవ్ర ఎల్ నినో పరిస్థితులలో నీరు,విద్యుత్తును పొదుపుగా వాడుకొని కలిసికట్టుగా విపత్తును ఎదుర్కొందామని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు
ములకలపల్లి.గ్రామపంచాయతీ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో.ఖేత్ బచావో అభియాన్,ఎల్ నినో విపత్తును అధిగమించ డానికి జరిగిన రైతు.సదస్సులో.ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఒకే రకమైన పంటలు వేయడం,అధిక మోతాదులో రసాయన ఎరువులు,పురుగు మందులు వాడకం వలన భూమి నిస్సారంగా తయారై పంటలు పండే అవకాశం ఉండదని అందుకని రసాయనాలు తక్కువగా వాడి సేంద్రియ ఎరువులతో వైవిధ్యంతో కూడుకున్న పంటలను వేయడానికి రైతులు సన్నద్ధం కావాలని, ఎల్ నినో లాంటి విపత్తు తెలంగాణకు మాత్రమే పరిమితం కాదని ఇది ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య అని ప్రతిపక్షాలు రైతులను గందరగోళ పరచకుండా విపత్తును ఎదుర్కోవడానికి వ్యవసాయ శాఖకు సహకరించి, భూగర్భ జలాలు అడుగంటి పోవడం, జలాశయాలలో నీరు లేకపోవడం, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి, తాగునీరుకె కటకటగా మారిన నేపథ్యంలో రైతాంగాo యాసంగిలో ఎట్టి పరిస్థితులలో వరి వేయకుండా, ఆరుతడి పంటలను సాగు చేసి, నీరు,విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు
సబ్సిడీతో రైతులకు మినుము విత్తనాల ప్యాకెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనిల్,గ్రామ సర్పంచ్ కళావతి జగదీష్,ఇరిగేషన్ ఏఈ కిషన్ నాయక్, ఏఈఓ లు లెనిన్, అనూష, వార్డు సభ్యులు, జక్కుల రాంబాబు, ఆంజనేయులు రామకృష్ణ మరియు రైతులు.తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!