ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బదిలీపై వెళ్తున్న సిబ్బందికి ఘన వీడ్కోలు సమావేశం

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బదిలీపై వెళ్తున్న సిబ్బందికి ఘన వీడ్కోలు సమావేశం

📰 Generate e-Paper Clip

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బదిలీపై వెళ్తున్న సిబ్బందికి ఘన వీడ్కోలు సమావేశం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డిఎంహెచ్ఓ డాక్టర్ భూక్యా రవి రాథోడ్, డీప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సుధీర్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ )లో సుదీర్ఘకాలం పాటు ప్రజలకు విశిష్ట సేవలందించి, బదిలీపై వెళ్తున్న వివిధ విభాగాల సిబ్బందికి మాతృ సంస్థలో ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం జరిగింది. వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డిఎంహెచ్ఓ డాక్టర్ భూక్యా రవి రాథోడ్, డీప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న సిబ్బందిని శాలువాలు, పూలమాలలతో అధికారులు, తోటి సిబ్బంది అత్యంత ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ.బదిలీపై వెళ్తున్న సిబ్బంది ఇన్ని సంవత్సరాల పాటు వైద్య రంగంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎన్నో ప్రజారోగ్య కార్యక్రమాలను ఎంతో అంకితభావంతో విజయవంతం చేశారని కొనియాడారు. ప్రజారోగ్య పరిరక్షణలో దశాబ్దాల పాటు అలసిపోకుండా వారు అందించిన సేవలు ఎనలేనివని ప్రశంసించారు. కొత్త ప్రాంతాలలో కూడా ఇదే ఉత్సాహంతో పని చేసి, ప్రజల మెప్పు పొందాలని ఆకాంక్షించారు.బదిలీ అయిన సిబ్బంది వివరాలు:సుదీర్ఘ కాలం సేవలందించి బదిలీ అయిన వారిలో బి.విజయకుమారి (32 సంవత్సరాల సేవ), సిహెచ్. సరళ (31 సం.), మోహినమ్మ (30 సం.), వెంకటేశ్వర్లు (28 సం.), చంద్రకళ (18 సం.), ఏ.బి.టి. సుందరి (18 సం.), నర్సబాయి (18 సం.), ఆర్. పద్మ (16 సం.), ఫెరోజ్ (10 సం.), సీనియర్ అసిస్టెంట్ ఎస్. రవిచంద్ర (4 సం.), మరియు సాయిశ్రీ ఎం ఎల్ హెచ్ పి – 4 సం.) ఉన్నారు.కార్యక్రమంలో పాల్గొన్నవారు:ఈ వీడ్కోలు వేడుకలో డాక్టర్ పూజిత, డాక్టర్ స్వామి, డాక్టర్ కిరణ్ సాగర్, పిహెచ్ఎన్ఓ మంగమ్మ, హెల్త్ సూపర్వైజర్లు ఆచార్యులు, మాధవి, లలిత కుమారిలతో పాటు పల్లె దవాఖానా సిబ్బంది, ఏఎన్ఎంలు ఆశా ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆసుపత్రి సిబ్బంది పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!