ePaper
Sunday, August 2, 2026
ePaper
Homeఎడిటోరియల్23 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు

23 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు

📰 Generate e-Paper Clip

23 ఏళ్ల సేవలకు ఘన వీడ్కోలు

డీఆర్‌డీఏ–సెర్ప్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ కొమ్ము మల్లేశంకు భావోద్వేగ సన్మానం

➤ 23 సంవత్సరాలపాటు వివిధ జిల్లాల్లో విశిష్ట సేవలు

➤ డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో ఘనంగా పదవీ విరమణ సన్మాన సభ

➤ సెర్ప్ ఉద్యోగుల సంఘం, జిల్లా సమాఖ్య ప్రతినిధుల ఘన సన్మానం

➤ అధికారులు, సిబ్బంది, ఆర్పీలతో సందడిగా వీడ్కోలు కార్యక్రమం

➤ కుటుంబ సభ్యులతో కలిసి మల్లేశంను ఇంటివరకు చేర్చిన డీఆర్‌డీఓ

➤ సేవా నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడిన పలువురు

కుత్బుల్లాపూర్ జులై 31 ( నమస్తే భారత్ ); డీఆర్‌డీఏ–సెర్ప్‌లో కమ్యూనిటీ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహించిన కొమ్ము మల్లేశం శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు డీఆర్‌డీఏ కార్యాలయంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి డీఆర్‌డీఓ అధ్యక్షత వహించి మల్లేశం అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు.కొమ్ము మల్లేశం గత 23 సంవత్సరాలుగా డీఆర్‌డీఏ–సెర్ప్‌లో వివిధ జిల్లాల్లో పనిచేస్తూ గ్రామీణ పేదరిక నిర్మూలన, మహిళా సంఘాల బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో విశేష సేవలందించారు. ఆయన నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావం అందరికీ ఆదర్శంగా నిలిచాయని పలువురు వక్తలు ప్రశంసించారు. సన్మాన కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం బాధ్యులు, జిల్లా సమాఖ్య సిబ్బంది, డీపీఎంలు, ఏపీఎంలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, అకౌంటెంట్లు, ఆర్పీలు, డీఆర్‌డీఏ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని మల్లేశంకు శాలువా కప్పి, జ్ఞాపికలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి అధికారి సాంబశివరావు, టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు వినోద్, జిల్లా సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి తదితరులు మాట్లాడుతూ మల్లేశం తన ఉద్యోగ జీవితంలో ఎంతో అంకితభావంతో సేవలందించారని, ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం డీఆర్‌డీఓ స్వయంగా మల్లేశం, ఆయన కుటుంబ సభ్యులను తన అధికారిక వాహనంలో వారి నివాసానికి చేర్చడం సభలోని అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. అధికారుల ఆప్యాయత, సహచర ఉద్యోగుల అభిమానానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య ప్రతినిధులు, డీపీఎంలు, ఏపీఎంలు, మండల కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, అకౌంటెంట్లు, ఆర్పీలు, సెర్ప్ ఉద్యోగులు, డీఆర్‌డీఏ సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!