మరిపెడ బంగ్లాలో వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని గణపతి మండపంలో లక్కీ డ్రా
ఉల్లి శ్రీనివాస్, బూరుగు దిలీప్‌కుమార్‌కు అదృష్టం
శ్రీ శ్రీనివాస అగ్రి మాల్ ప్రొప్రైటర్స్‌కు దక్కిన లడ్డూ
నమస్తే భారత్ :-మరిపెడ
మరిపెడ బంగ్లాలోని ఎస్‌బీఐ గల్లీలో వెంకటేశ్వర థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో బుధవారం లక్కీ డ్రా నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ లక్కీ డ్రాలో చిన్న లడ్డూను శ్రీ శ్రీనివాస అగ్రి మాల్ ప్రొప్రైటర్స్ ఉల్లి శ్రీనివాస్, బూరుగు దిలీప్‌కుమార్.దక్కించుకున్నారు.లక్కీ డ్రాలో లడ్డూ తమకు దక్కడంతో ఉల్లి శ్రీనివాస్, బూరుగు దిలీప్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు వారిని అభినందించారు. కార్యక్రమంలో గణపతి మండప నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



