ఖానాపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం
జనతా ట్రస్ట్ చైర్మన్ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
ఖానాపురం, నవంబర్ 3 (మల్లేష్ నమస్తే భారత్) : జనతా ట్రస్ట్ చైర్మన్ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జనతా ట్రస్ట్, బంధన్ హాస్పిటల్స్, శంకర కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరంతో పాటు ఐదవ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నాయి.
ఈ నెల 4వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఖానాపురంలోని పెద్దిరెడ్డి రంగారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఈ వైద్య శిబిరం జరగనుంది.బంధన్ హాస్పిటల్స్ వైద్యుల ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, పల్మనాలజీ, గైనకాలజీ, డెంటల్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, క్రిటికల్ కేర్ తదితర విభాగాల్లో వైద్య సేవలు అందించనున్నారు.
అలాగే శంకర కంటి ఆసుపత్రి నిపుణులచే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేయడంతో పాటు అర్హులైన వారికి కళ్లద్దాలు అందజేయనున్నారు.
ఖానాపురం మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉచిత వైద్య సేవలను పొందాలని నిర్వాహకులు కోరారు.



