123వ డివిజన్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన వినయ్ కుమార్!
సబితా ఇంద్రారెడ్డి, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక
నమస్తే భరత్ నవంబర్ 3 గండిపేట మండల్ రిపోర్టర్ శ్రీనివాస్: 123వ డివిజన్‌కు చెందిన వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో పాటు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంపై ఉన్న అభిమానంతోనే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వినయ్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రావులకోళ్ళ నాగరాజ్
బీఆర్ఎస్ అధ్యక్షుడు,
బండ్లగూడ, శాంతి కుమార్ భారత రాష్ట్ర సమితి కార్యదర్శి బండ్లగూడ జాగిర్



