ePaper
Wednesday, November 4, 2026
ePaper
Homeతెలంగాణమామునూరు విమానాశ్రయ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

మామునూరు విమానాశ్రయ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

మామునూరు విమానాశ్రయ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు

వరంగల్ నవంబర్ 4(మల్లేష్ మీ వార్త ప్రతినిధి) :వరంగల్ మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరినట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు తెలిపారు.ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. విమానాశ్రయ నిర్మాణం కాకతీయుల కళా వైభవం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని కోరినట్లు పేర్కొన్నారు.
మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తవుతున్నాయని, వచ్చే డిసెంబర్‌లో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపినట్లు మదన్ మోహన్ రావు వెల్లడించారు.ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించే అవకాశం ఉందని, ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తే వరంగల్ ప్రాంత అభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి, పర్యాటక రంగ విస్తరణకు మరింత ఊతం లభిస్తుందని మదన్ మోహన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!