ePaper
Wednesday, November 4, 2026
ePaper
Homeఎడిటోరియల్డిసెంబర్ 15 నుంచి ఆశాల నిరవధిక సమ్మె మెడికల్ ఆఫీసర్లకు సమ్మె నోటీసులు

డిసెంబర్ 15 నుంచి ఆశాల నిరవధిక సమ్మె మెడికల్ ఆఫీసర్లకు సమ్మె నోటీసులు

📰 Generate e-Paper Clip

డిసెంబర్ 15 నుంచి ఆశాల నిరవధిక సమ్మె

మెడికల్ ఆఫీసర్లకు సమ్మె నోటీసులు

నర్సంపేట నవంబర్ 3(మల్లేష్ నమస్తే భారత్ ) : ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు తెలిపారు.ఈ మేరకు నర్సంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, బాంజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లకు ఆశా కార్యకర్తలతో కలిసి సమ్మె నోటీసులు అందజేశారు.
ఈ సందర్భంగా గోనె యువరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని ఆరోపించారు. తమ సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతో ఆశా కార్యకర్తలు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారని తెలిపారు. డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు విధులను బహిష్కరించి సమ్మె చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పీపీ యూనిట్ అధ్యక్షురాలు సంధ్య, బాంజీపేట పీహెచ్‌సీ అధ్యక్షురాలు సునీత, నాయకులు లలిత, రమ, సరోజన, లత, విజయ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!