చించోడు ఆసుపత్రిలో 80వ 15th ఆగస్టు జండా ఆవిష్కరణ

డాక్టర్ స్రవంతి చించోడు వైద్య అధికారి
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 15: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడులో 80వ 15th ఆగస్టు జండా ఆవిష్కరణ డాక్టర్ స్రవంతి చేశారు. డాక్టర్ స్రవంతి గారు మాట్లాడుతూ 1947వ సంవత్సరముకు ముందు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుండేవారు అని, ఆప్పుడు మన దేశ నాయకులు ఎందరో మహానుభావులు వారి ప్రాణాలకు లెక్కచేయకుండా బ్రిటిష్ వారితో పోరాటం జరిపి మన దేశానికి 1947 అర్ధరాత్రి 15 ఆగస్టు రోజున స్వాతంత్రం తీసుకొచ్చారని డాక్టర్ స్రవంతి తెలియజేశారు. అలాంటి స్వాతంత్రాన్ని మన అందరము కలిసికట్టుగా ఉండి, ఐక్యతంగా ఉండి, పనిచేస్తూ భారతదేశ గౌరవాన్ని ఇంకా పెంపొందించాలని చెప్పారు. మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే ఆరోగ్య వ్యవస్థలో ముఖ్యమైన భాగం అని, గ్రామీణ ప్రజలకు మాత శిశు ఆరోగ్యం, టీకాలు, కుటుంబ నియంత్రణ, అంటువ్యాధుల నివారణ, ఎన్ సి డి స్క్రీనింగ్, పోషకాహారం, పారిశుద్ధ్యం మరియు ఆరోగ్య అవగాహన వంటి సేవలను అందించడం మన బాధ్యత అని ఆరోగ్యం సిబ్బందికి డాక్టర్ స్రవంతి తెలియజేశారు.
తదుపరి హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు మాట్లాడుతూ ఈరోజు మన భారతదేశానికి ఎంతో గర్వకారణమైన 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుపుకోవడం మనందరికీ ఎంతో ఆనందంగా ఉందని జె. శ్రీనివాసులు చెప్పారు . ఎందరో మహానీయులు స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి మనకు స్వాతంత్రాన్ని అందించారు. మహాత్మా గాంధీజీ , సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, వంటి ఎందరో వీరుల త్యాగాలను ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి అని హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు చెప్పారు. “*ఆరోగ్యమే మహాభాగ్యం*” అనే మాటను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలి అని, పరిశుభ్రమైన పరిసరాలు , సురచితమైన తాగునీరు, పోషకాహారం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు మరియు వ్యాధులపై అవగాహన మన ఆరోగ్యాన్ని కాపాడతాయని జె. శ్రీనివాసులు చెప్పారు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన అందరం ఒక సంకల్పం చేద్దామని, అది ఏంటి అనగా!
“*నా ఆరోగ్యం -నా బాధ్యత* ”
“*నా కుటుంబ ఆరోగ్యం-నా బాధ్యత* ”
“*నా గ్రామ ఆరోగ్యం- మన అందరి బాధ్యత* ”
మన దేశం మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, ఉపాధి పనులు మరియు సమాన అవకాశాలు లభించాలని కోరుకుంటున్నాను అని జె. శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు డాక్టర్ స్రవంతి, ఎమ్. ఎల్ .హెచ్.పి . వైద్య అధికారులు డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ ముస్తకిన్ అహ్మద్, హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ శ్రీ రామ, ఫార్మసిస్ట్ పర్వతాలు, ల్యాబ్ టెక్నీషియన్ అశోక్, స్టాఫ్ నర్స్ అరుణ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు ఏఎన్ఎంలు, కాంటిజెంట్ వర్కర్లు శ్రీను, మన్నెమ్మ మొదలగు వారు పాల్గొన్నారు.



