ePaper
Friday, September 11, 2026
ePaper
Homeఎడిటోరియల్పాఖాల నీటిని విడుదల చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే

పాఖాల నీటిని విడుదల చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

పాఖాల నీటిని విడుదల చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే

నర్సంపేట ఆగష్టు15(నమస్తే భారత్ ) :
పాఖాల ఆయకట్టు పంటలకు పాఖాల చెరువు నీటిని విడుదల చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశించారు.
నర్సంపేట లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి
పాకాల ఖరీఫ్ పంటకు సాగు నీటి విషయంపై జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో చర్చించారు.నీటి సమస్యపై ఐబీ అధికారులతో చర్చించి చెరువులోని నీటిని సంగం కాలువ ద్వారా రైతుల పంట పొలాల సాగు కోసం వెంటనే అందించాలని ఆదేశించారు.వానకాలం పంట సాగుకుగాను పాకాల సరస్సు నుండి నీటిని విడుదల చేయాలని శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ , ఖానాపురం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు , ఖానాపురం సోసైటి చైర్ పర్సన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ తో పాటు సంబంధిత అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!