యువసేన యూత్ అద్వర్యంలో జెండా పండుగ
ఖానాపురం ఆగష్టు15(నమస్తే భారత్ ) :
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖానాపురం మండలం ధర్మారావు పేట గ్రామంలోని శ్రీ యువసేన యూత్ అధ్యక్షుడు ముంజాల సంజీవ గౌడ్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి పల్లెలు పట్టుకొమ్మలు అనిఅన్నారు. అందుకే పల్లెల అభివృద్ధికి యువత ముందుకు రావాలన్నారు. సమస్యలను పరిష్కరించే దిశగా యువత తమ వంతు పాత్రపోసించాలని సూచించారు.
ఈకార్యక్రమంలో యువసేన యూత్ సంఘ సభ్యులు ,సీనియర్ నాగినేని వెంకటేశ్వరరావు వేల్పుల సుధాకర్ సముద్రాల మహేందర్ తదితరులు పాల్గోన్నారు.



