ePaper
Tuesday, October 27, 2026
ePaper
Homeఎడిటోరియల్విద్యుత్, సాగునీరు, తాగునీటి అంశాలపై వాస్తవాలను వెల్లడించాలి

విద్యుత్, సాగునీరు, తాగునీటి అంశాలపై వాస్తవాలను వెల్లడించాలి

📰 Generate e-Paper Clip

విద్యుత్, సాగునీరు, తాగునీటి అంశాలపై
వాస్తవాలను వెల్లడించాలి

బీఆర్ఎస్ మండల కమిటి డిమాండ్

ఖానాపురం అక్టోబర్ 25 ( మల్లేష్ నమస్తే భారత్) : విద్యుత్ సంక్షోభం, సాగునీటి నిర్వహణ, తాగునీటి లభ్యత, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరాలు వెల్లడించాలని ఖానాపురం బీఆర్ఎస్ మండల కమిటి డిమాండ్
డిమాండ్ చేసింది. ఈసందర్భంగా ఖానాపురం మండల కేంద్రంలో అదివారం నిర్వహించిన విలేఖరుల హమావేశంలో బీఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మహలక్ష్మి వెంకటనర్సయ్య ,బీఆర్ ఎస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిని శ్రీనావాస్ గౌడ్ , మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు లు మాట్లాడుతూ
గత మూడేళ్లలో చేసిన అప్పులు, వాటి వినియోగంపై ప్రభుత్వం సమగ్ర వివరాలు వెల్లడించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో చేసిన అప్పులతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కువగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అప్పుల ద్వారా సమీకరించిన నిధులను ఏయే రంగాలకు ఖర్చు చేశారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ సరఫరాపై స్పష్టత ఇవ్వాలి :

రాష్ట్రంలో విద్యుత్ కొరతపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల పట్ల బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. విద్యుత్ కొనుగోలు ధరలు, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ నిల్వలు, భవిష్యత్తులో అవసరమయ్యే విద్యుత్ పరిమాణంపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరింది. గృహ, పారిశ్రామిక రంగాలకు ఎంత విద్యుత్ అవసరం, రాష్ట్రంలో ఎంత విద్యుత్ అందుబాటులో ఉంది, ఇంకా ఎంత విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుందనే అంశాలను లెక్కలతో సహా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేసింది.

నీటి నిర్వహణలో ముందుచూపు అవసరం :

ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులపై వాతావరణ నిపుణులు చేస్తున్న హెచ్చరికలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని బీఆర్ఎస్ విమర్శించింది. కృష్ణా, గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థంగా వినియోగించుకుని ఉంటే కరువు ముప్పును కొంతవరకు ఎదుర్కొనే అవకాశం ఉండేదని పేర్కొంది.
రాబోయే పది నెలల్లో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అవసరమయ్యే తాగునీరు, గృహ అవసరాలు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలపై ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహించాలని సూచించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, భవిష్యత్తు అవసరాలు, నీటి పంపిణీ ప్రణాళికను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేసింది.

కేసీఆర్‌పై విమర్శలు మానుకోవాలి :

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై విమర్శలు చేయడం కంటే ప్రస్తుత సమస్యలకు పరిష్కారాలు చూపడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని బీఆర్ఎస్ నాయకులు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను గత ప్రభుత్వంపై నెట్టివేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రస్తుత సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అన్నారు.

నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలి :

రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలు, నిత్యావసర సరుకుల కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు నూనె, పప్పు ధాన్యాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరింది. ఆహార నిల్వలు, ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలపై అధికారులు సమీక్ష నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
విద్యుత్, నీటి నిల్వలు, సాగునీటి నిర్వహణ, ఆహార భద్రత, రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం సమగ్ర వివరాలు వెల్లడించాలని ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రజల్లో ఆందోళన కలిగించే ప్రకటనలు చేయడం కంటే వాస్తవ పరిస్థితులను వివరించి, సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనను తీవ్రంగా ఖండించింది. ఈకార్యక్రమంలో ఖానాపురం మండల బీఆర్ ఎస్ నాయకులు, ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ ,ధర్మరావుపేట సర్పంచ్ మాడ్రాజు వెంకన్న ,మనుబోతులగడ్డ సర్పంచ్ అబోతు శ్రీలతఅశోక్ , వివిధగ్రామాల సర్పంచ్ లు పాల్గోన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!