ePaper
Thursday, June 18, 2026
ePaper
Homeఎడిటోరియల్అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

📰 Generate e-Paper Clip

అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

నమస్తే భారత్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)

జిల్లా ఆర్మడ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వరస్తూ అనారోగ్యంతో ఇటీవల మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ మహమూద్ కుటుంబానికి బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో చెక్కు రూపంలో లక్ష నగదును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో నిరంతరం విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.మరణించిన పోలీసుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.ప్రభుత్వం తరఫున మరణించిన పోలీసు అధికారుల కుటుంబాలకు అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ ఏవో మంజ్యా నాయక్, పోలీస్ అధికారుల సంఘం సభ్యుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!