పినపాక డిప్యూటీ తాసిల్దార్ గా డాక్టర్ రమేష్ పదవి బాధ్యతలు స్వీకరణ

నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)
పినపాక మండల నూతన డిప్యూటీ తహసీల్దార్‌గా డాక్టర్ రమేష్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండల తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఆయనకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన ఉప తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ, అర్హులైన ప్రజలందరికీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి పైరవీలకు తావివ్వకుండా చట్టబద్ధంగా, పారదర్శకంగా సేవలందిస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన రమేష్‌కు రెవెన్యూ శాఖ సిబ్బంది, సహోద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.

