కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా వైస్ చైర్మన్‌గా దస్తగిరి ఖాన్

కొలన్ హన్మంత్ రెడ్డిని కలిసి నియామక పత్రం స్వీకరణ
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచన
కుత్బుల్లాపూర్, ఆగస్టు 6: ( నమస్తే భరత్ ); మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా వైస్ చైర్మన్‌గా దస్తగిరి ఖాన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నియామక పత్రాన్ని స్వీకరించారు. అనంతరం దస్తగిరి ఖాన్, కొలన్ హన్మంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతంతో పాటు మైనారిటీల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాదేవపురం డివిజన్ అధ్యక్షుడు సిద్ధనోళ్ల సంజీవరెడ్డి, టీపీసీసీ మైనారిటీ డిపార్ట్‌మెంట్ స్టేట్ జాయింట్ కన్వీనర్ సమీర్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వలి భాయ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



