బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయలు అందజేసిన
ఎమ్మెల్యే.యశస్విని రెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూర్
మహబూబాబాద్ జిల్లా తొర్రురు మండలం మరియు పట్టణంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాల్లో ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటనల నేపథ్యంలో స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి వారి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మారపు మహేందర్ తల్లి, తండ్రి ఇద్దరూ కొద్దిరోజుల వ్యవధిలో మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ధర్మారపు వెంకన్న ని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం చికటాయపాలెం గ్రామానికి చెందిన ఓరిగంటి రుక్కమా ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
తొర్రూరు పట్టణంలోని బిరప్పనగర్‌కు చెందిన వై.వాసి పరంకుశం యశ్వంత్ ఇటీవల మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.అదేవిధంగా తొర్రూరు పట్టణంలోని టీచర్స్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు హరిత కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ధైర్యం చెబుతూ, ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. భగవంతుడు మృతుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.



