ePaper
Friday, October 9, 2026
ePaper
Homeతెలంగాణ*రాజీనామా చేయాలి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే*

*రాజీనామా చేయాలి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే*

📰 Generate e-Paper Clip

*రాజీనామా చేయాలి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే*

*ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్*

*ఎస్ ఐ ప్రక్రియ వెంటనే ఆపాలి*

*విద్యార్థులుగా మా మాట*
*మేము విద్యార్థులం నేటి విద్యార్థులమే రేపటి ఓటర్స్ మేము*

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్07: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. ఒక్క ఓటు కూడా దేశ భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. అందుకే ఓటర్ల జాబితా సవరణలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండాలి, అనర్హుల పేర్లు తొలగించాలి.ఎస్ ఐ ఆర్ పేరుతో అర్హులైన పౌరుల పేర్లు తప్పుగా తొలగించబడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓటర్లకు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకునే అవకాశం, అభ్యంతరాలు చెప్పే అవకాశం స్పష్టంగా ఉండాలి.
విద్యార్థులుగా మా డిమాండ్ ఒక్కటే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రతి చర్య పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలి.ఓటు మా హక్కుప్రజాస్వామ్యం మా బాధ్యత!”అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి!పాత పద్ధతి ప్రకారమే సీఈసీ సెలక్షన్ ఉండాలి.ప్రజలను మరియు విద్యార్థులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్ ప్రశ్నించారు. సీఈసీ సెలక్షన్ చేసే పద్ధతి సరిగా లేదని వారు అన్నారు సీఈసీ సెలక్షన్ సమక్షంలో జరగాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతి ప్రకారమే సీఈసీ సెలక్షన్ ఉండాలని పట్టుబట్టారు. 2002లో ఓ వ్యక్తికి ఓటు హక్కు ఉందని.. కానీ ఇప్పుడు ‘సర్’ ప్రక్రియలో పేరు ఎందుకు రావట్లేదని నిలదీశారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ‘సర్’లో పేరు ఎందుకు ఉండట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సీఈసీ ఎన్నిక పద్ధతిలో బీజేపీ తీసుకువచ్చిన చట్టం మార్చాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ ఉపాధ్యక్షులు ఆదిల్, రామ్ చరణ్, తరుణ్ బబ్లు,రవీంద్ర, వంశీ,ధను, భాను, విష్ణు, భరత్,జగదీష్,సాయికిరణ్, అభిలాష్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!