ePaper
Friday, October 9, 2026
ePaper
Homeతెలంగాణతెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ప్రచారం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ప్రచారం

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ప్రచారం

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్ 07:తెలంగాణ ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బహుజన వర్కర్స్ యూనియన్ కత్తెర గుర్తుకు ఓటు వేయమని షాద్ నగర్ బస్ స్టేషన్ లో షాద్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు ఎమ్మె సంతోష్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మె సంతోష్ గారు మాట్లాడుతూ… తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బహుజన వర్కర్స్ యూనియన్ తో కొత్త నాయకత్వం ప్రశ్నించే గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్న గారి ఆశయాలతో ఆర్టీసీ కార్మికులకు వారి యొక్క డిమాండ్లను ప్రభుత్వంతో పోరాడి సాధించుకుంటాం అని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులారా ఒక్కసారి ఆలోచించండి మోసగించే ప్రభుత్వాలకు కొమ్ముకాసే నాయకుల వెంట వెళితే నష్టం తప్పదని మీ న్యాయ మైన హక్కుల కోసం పోరాడే గొంతుకకు తోడ్పాటు అవ్వండని కోరారు.ఈ కార్యక్రమంలో ఫరుక్ నగర్ మండల అధ్యక్షులు ఆవ జగన్, షాద్ నగర్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఉప్పర మౌని రాములు, షాద్ నగర్ టిఆర్ పి నాయకులు గుల్ల హరిప్రసాద్, గడీల అంజయ్య, ఆర్టీసీ యూనియన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!