ePaper
Friday, October 9, 2026
ePaper
Homeతెలంగాణఆధారాలు లేకుండా విద్యా వ్యవస్థపై నిందలు మోపడం దారుణం ఖానాపురం ఎంఈఓ వెంకట్రామ్

ఆధారాలు లేకుండా విద్యా వ్యవస్థపై నిందలు మోపడం దారుణం ఖానాపురం ఎంఈఓ వెంకట్రామ్

📰 Generate e-Paper Clip

ఆధారాలు లేకుండా విద్యా వ్యవస్థపై నిందలు మోపడం దారుణం

ఖానాపురం ఎంఈఓ వెంకట్రామ్

ఖానాపురం అక్టోబర్ 6 (మల్లేష్ , నమస్తే భారత్ ) :

ఖానాపురం మండలం మంగళవారిపేట జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినుల విషయంలో చోటుచేసుకున్న ఘటనపై వాస్తవాలను నిర్ధారించకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై బాధ్యతారాహిత్య ఆరోపణలు చేయడం పూర్తిగా అసమంజసమని ఖానాపురం ఎంఈఓ వెంకట్రామ్ అన్నారు.
ఈసందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థినిల సంఘటనను ఆసరాగా చేసుకుని విద్యా వ్యవస్థపై నిందలు మోపేందుకు ఉపయోగించుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అందుబాటులో ఉన్న ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు వివరాల ప్రకారం విద్యార్థినుల చివరి హాజరు 26-09-2026. ఆ తర్వాత వారు పాఠశాలకు రాకపోవడంతో ఉపాధ్యాయులు మొబైల్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులను సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఎస్‌ఏ–1 పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు కూడా ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. అయితే విద్యార్థుల పరిస్థితి, వారి ఆచూకీపై ఉపాధ్యాయులకు స్పష్టమైన సమాచారం అందలేదు.
28-09-2026న విద్యార్థినులు పాఠశాలకు హాజరు కాలేదు. అదే రోజు సాయంత్రం వారి తల్లిదండ్రులే పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు మహబూబాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగినట్లు అందుబాటులో ఉన్న సమాచారంతో స్పష్టమవుతోంది. అనంతరం పోలీసుల జోక్యంతో విద్యార్థినులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిసిందన్నారు.
ఒక సంఘటనపై పూర్తి విచారణ జరగకముందే తీర్పు చెప్పడం, ఆధారాలు లేకుండా వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రచారం చేయడం తగదన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!