గీతా విద్యాలయంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
ప్రిన్సిపాల్ పోలోజు నరసింహాచారి
చండూరు, నమస్తే భారత్ నవంబర్ 14:
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శనివారం చండూరులోని గీతా విద్యాలయం (E/M) పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేస్తూ నెహ్రూ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ పోలోజు నరసింహాచారి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “నేటి బాలలే రేపటి పౌరులు” అని పేర్కొంటూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
జాతీయ స్థాయి నెహ్రూ అవార్డు ప్రదానం:
విద్యా రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ పోలోజు నరసింహాచారి గారికి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ‘నెహ్రూ అవార్డు’ లభించింది. శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి కంబాలపల్లి శివలీల గారి చేతుల మీదుగా ఈ అవార్డును నరసింహాచారి గారికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.



