MLC ఎన్నికల మక్తల్ నియోజకవర్గ ఇంచార్జీగా బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి
నమస్తే భరత్,,, 29/9/2026/ నారాయణపేట జిల్లా
త్వరలో జరుగబోయే గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ప్రక్రియలో భాగంగా మక్తల్ నియోజకవర్గ ఇంచార్జీగా బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారిని నియమిస్తున్నట్లు మహాబూబ్‌నగర్ పార్లమెంటుసభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారు తెలియజేసారు.
అదేవిదంగా సహా ఇంచార్జీలుగా శ్రీ కర్నె స్వామి గారు, శ్రీమతి జిందే జ్యోతి శ్రీనివాస్ గారు మరియు శ్రీ జయానంద్ రెడ్డి గార్లను నియమించారు.
MLC ఎన్నికల పట్టభద్రుల ఎన్రోల్ మెంట్ ప్రక్రియలో మక్తల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలలోని పట్టభద్రులను గుర్తించి వారి పేర్లను ఓటర్లుగా నమోదు చేసే విషయంలో రాజీ పడకుండా పని చేయాలనీ శ్రీమతి డీకే అరుణమ్మగారు సూచించారు.
మాపై నమ్మకముంచి ముందుకు నడిపిస్తున్న జేజమ్మ గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపిన శ్రీ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలోని పట్టబద్రులను గుర్తించి ఎన్రోల్ మెంట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేసారు.
జై శ్రీరామ్
జై బీజేపీ
భారత్ మాతాకీ జై
నమస్తే భరత్,,, 29/9/2026/ నారాయణపేట జిల్లా



