ePaper
Tuesday, August 25, 2026
ePaper
Homeఎడిటోరియల్ఉత్తమ సహకార సంఘాలకు అవార్డులు

ఉత్తమ సహకార సంఘాలకు అవార్డులు

📰 Generate e-Paper Clip

ఉత్తమ సహకార సంఘాలకు అవార్డులు


సహకార వారోత్సవాల్లో

అవగాహన కార్యక్రమం – రైతులకు సహకార సంఘాల సేవలు మరింత చేరువ కావాలని పిలుపు

కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భరత్ ): రాష్ట్రవ్యాప్తంగా జూన్ 29 నుంచి జూలై 6 వరకు నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల సందర్భంగా వాసుదేవ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కె.వి.ఎన్. అన్నపూర్ణ, ఎండీ/జాయింట్ రిజిస్ట్రార్, టీజీసీయూ మాట్లాడుతూ సహకార సంఘాల అభివృద్ధిలో సభ్యుల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. సహకార చట్టాలు, నియమ నిబంధనలపై సభ్యులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రైతులకు సహకార సంఘాల ద్వారా అందుతున్న రుణాలు, సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం 2025–26 సంవత్సరానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సహకార సంఘాలకు అవార్డులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సురేఖ రాణి, జాయింట్ రిజిస్ట్రార్, తెలంగాణ సహకార సంఘం, శ్రీ జి. శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి, మేడ్చల్–మల్కాజిగిరి, శ్రీ టి. వెంకట్ రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్, వివిధ సహకార సంఘాల ఛైర్మన్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీ ఆర్.ఎం.వి. ఆనంద్ రావు, సభ్యులు, సహకార శాఖ అధికారులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!