ప్రభుత్వ హాస్పిటల్ లో తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న అంగన్వాడి టీచర్లు డాక్టర్లు
,, నమస్తే భరత్,,, 6/8/2026/, నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ హాస్పిటల్ లోని
అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు మల్లీశ్వరి,మమత,మానస,
పోషన్ అభియాన్ BC రాజేష్,అంగన్వాడీ టీచర్లు——– మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కాబోయే తల్లులు మరియు వారి కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రాముఖ్యత, పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ప్రారంభించడం, మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, తల్లిపాల వల్ల తల్లి–బిడ్డలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది.
కార్యక్రమంలో పాల్గొన్న అందరూ తల్లిపాలను ప్రోత్సహిస్తూ, ప్రతి శిశువుకు తల్లిపాలు అందేలా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.



