ఉప్పలమ్మ స్ఫూర్తి చిరస్మరణీయం.

ఆమెకు ఘనంగా నివాళి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయి పాలెం గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) నాయకుడు కొండ ఉప్పలయ్య సతీమణి కొండ ఉప్పలమ్మ పెద్దకర్మ సందర్భంగా సీపీఐ(ఎం), సీఐటీయూ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉప్పలమ్మ కుటుంబ బాధ్యతలను మాత్రమే కాకుండా ఉప్పలయ్య ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఎప్పుడూ అండగా నిలిచారని ముందుకు సాగించారని వారు పేర్కొన్నారు. సమాజం కోసం నిరంతరం శ్రమించే ఉద్యమ నాయకుడి వెనుక ఆమె అందించిన సహకారం, ధైర్యం, త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు.ప్రజా ఉద్యమాల్లో నిమగ్నమైన ఉప్పలయ్యకు జీవిత భాగస్వామిని కోల్పోవడం తీరని వ్యక్తిగత వేదన అని, ఈ క్లిష్ట సమయంలో ఆయన ధైర్యంగా ఉండి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని నాయకులు భరోసా కల్పించారు. ఉప్పలమ్మ ఆశయాలు, ఆమె అందించిన స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ ప్రజా సేవలో మరింత నిబద్ధతతో ఉప్పలయ్య ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అలవాల వీరయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మెట రాజమౌళి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్, సీఐటీయూ మండల కన్వీనర్ దుండి వీరన్న, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి నక్క సైదులు, మహబూబాబాద్ సీఐటీయూ పట్టణ కార్యదర్శి కే. నాగన్న, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య, కోటేశ్వరరావు, నాయకులు నందిపాటి వెంకన్న, ఎర్ర వెంకన్న, కొండ వెంకన్న, మైసయ్య, సైదులు, జామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.



