ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeఎడిటోరియల్జానకమ్మ స్మృతిలో స్వర నీరాజనం.. మణుగూరులో సంగీత విభావరి విజయవంతం

జానకమ్మ స్మృతిలో స్వర నీరాజనం.. మణుగూరులో సంగీత విభావరి విజయవంతం

📰 Generate e-Paper Clip

జానకమ్మ స్మృతిలో స్వర నీరాజనం.. మణుగూరులో సంగీత విభావరి విజయవంతం

నమస్తే భారత్, మణుగూరు

మొల్ల స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో, జ్యోతి ఈవెంట్స్ ఆధ్వర్యంలో జానకమ్మ స్మృతిలో “స్వర నీరాజనం” కార్యక్రమం ఆదివారం మణుగూరులోని వేణు రెస్టారెంట్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు కళాకారులు తమ మధుర గానాలతో ప్రేక్షకులను అలరించగా, కార్యక్రమం ఆద్యంతం సాంస్కృతిక వాతావరణంలో విజయవంతంగా సాగింది. జానకమ్మ జ్ఞాపకాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమానికి స్థానిక ప్రజలు, కళాభిమానులు విశేషంగా హాజరయ్యారు.కార్యక్రమం విజయవంతం కావడానికి మొదటి నుంచి అండగా నిలిచి సహాయ సహకారాలు అందించిన ఉపేందర్, దండ నరసింహారావు, సత్యనారాయణ, లక్ష్మణ్, బాలకృష్ణ, తమ్మిశెట్టి రమాదేవి, ఉప్పాడ అనితతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికీ జ్యోతి ఈవెంట్స్ నిర్వాహకురాలు పూజారి జ్యోతి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవతో పాటు కళా సంస్కృతిని ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని పలువురు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!