జానకమ్మ స్మృతిలో స్వర నీరాజనం.. మణుగూరులో సంగీత విభావరి విజయవంతం

జానకమ్మ స్మృతిలో స్వర నీరాజనం.. మణుగూరులో సంగీత విభావరి విజయవంతం నమస్తే భారత్, మణుగూరు మొల్ల స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో, జ్యోతి ఈవెంట్స్ ఆధ్వర్యంలో జానకమ్మ స్మృతిలో "స్వర నీరాజనం" కార్యక్రమం ఆదివారం మణుగూరులోని వేణు రెస్టారెంట్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు కళాకారులు తమ మధుర గానాలతో ప్రేక్షకులను అలరించగా, కార్యక్రమం ఆద్యంతం సాంస్కృతిక వాతావరణంలో విజయవంతంగా సాగింది. జానకమ్మ జ్ఞాపకాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమానికి స్థానిక ప్రజలు, కళాభిమానులు విశేషంగా హాజరయ్యారు.కార్యక్రమం విజయవంతం కావడానికి...