ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeఎడిటోరియల్స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో దేశభక్తి సందేశం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో దేశభక్తి సందేశం

📰 Generate e-Paper Clip

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో దేశభక్తి సందేశం

ఆయిల్ శ్రీశైలం గౌడ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 15:వెల్జాల్ గ్రామంలో ఘనంగా జెండా ఆవిష్కరణ
రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం, వెల్జాల్:
దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వెల్జాల్ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు తిరుమని రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, యువకులు, విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆయిల్ శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. స్వాతంత్ర్య సమరయోధులు ప్రజలను సంఘటితం చేసి అనేక ఉద్యమాలు నిర్వహించి, భారతదేశ స్వాతంత్ర్య ఆకాంక్ష కోసం తమ ప్రాణాలను సైతం అర్పించారని తెలిపారు.
కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా దేశ ప్రజలందరూ ఐక్యంగా నిలిచి, “భారతదేశ స్వాతంత్రమే తమ ధ్యేయం” అనే ఒకే లక్ష్యంతో పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం వంటి హక్కులను అనుభవిస్తున్నారని అన్నారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి హృదయపూర్వక ఘన నివాళులు అర్పించారు. వారి స్ఫూర్తితో దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!