ePaper
Wednesday, July 15, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీకేఆర్ ఫౌండేషన్ సేవలు

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీకేఆర్ ఫౌండేషన్ సేవలు

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీకేఆర్ ఫౌండేషన్ సేవలు
-కుత్బుల్లాపూర్‌లో 50వ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బొంగునూరి కిషోర్ రెడ్డి
-రామ్‌రెడ్డి నగర్ కాలనీ వాసులకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
-దుండిగల్ 2బీహెచ్‌కే కాలనీలో నూతన వాటర్ ఏటీఎం ప్రారంభం
-స్వచ్ఛమైన తాగునీరు ప్రతి కుటుంబానికి అందాలన్నదే లక్ష్యమన్న కిషోర్ రెడ్డి
-ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడి
-ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు, టీమ్ బీకేఆర్ సభ్యులు

కుత్బుల్లాపూర్, జూలై 12 ( నమస్తే భరత్ ): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీకేఆర్ (BKR) ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆదివారం రెండు కీలక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రోటోకాల్ & సమన్వయ ఉపాధ్యక్షుడు బొంగునూరి కిషోర్ రెడ్డి 290వ డివిజన్ రామ్‌రెడ్డి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన 50వ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు, 294వ డివిజన్ దుండిగల్ 2బీహెచ్‌కే హౌసింగ్ కాలనీలో బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన వాటర్ ఏటీఎంను ప్రజలకు అంకితం చేశారు. మొదటగా రామ్‌రెడ్డి నగర్ కాలనీలో నిర్వహించిన 50వ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ శిబిరాలను నిరంతరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాలనీవాసులు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. శిబిరంలో వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. అనంతరం దుండిగల్ 2బీహెచ్‌కే హౌసింగ్ కాలనీలో బీకేఆర్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన నూతన వాటర్ ఏటీఎంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. సమాజ అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపట్టడం బీకేఆర్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని, ప్రజల సంక్షేమం కోసం భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఉచిత వైద్య శిబిరం, వాటర్ ఏటీఎం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మణికంఠ, వెంకటేష్ (గున్ని), సింధేష్ చౌదరి, అయ్యప్ప నాయుడు, దిలీప్ సింగ్, రమేష్, వినయ్, సుధీర్, కావలి గణేష్, సాధు యాదవ్, నర్సింహారెడ్డి, శ్రీశైలం యాదవ్, శ్రీధర్ రెడ్డి, గజ, టిటికె శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే రామ్‌రెడ్డి నగర్, దుండిగల్ 2బీహెచ్‌కే కాలనీల నివాసితులు, టీమ్ బీకేఆర్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!