ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeఎడిటోరియల్పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

📰 Generate e-Paper Clip

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

-కుత్బుల్లాపూర్‌లో ఐదుగురు లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కొలన్ హన్మంత్ రెడ్డి

-అనారోగ్య బాధితులకు రూ. 2.58 లక్షల ఆర్థిక సాయం.. సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి

బాచుపల్లి, జూలై 11 ( నమస్తే భరత్ ): అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్‌) ద్వారా ఆర్థిక చేయూత అందింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధికి చెందిన పలువురు పేద ప్రజలు వైద్య చికిత్స ఖర్చులు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని ఆశ్రయించారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం మంజూరు చేయించారు. శనివారం బాచుపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొలన్ హన్మంత్ రెడ్డి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సనది సోనీకి రూ.60 వేలు , పెంతోట వెంకటేశ్వర్లుకు రూ.37,500, బొండాడ రాజుకు రూ.60 వేలు, మరోజు పద్మకు రూ.41 వేలు, జులా స్రవంతికి రూ.60 వేలు చొప్పున మొత్తం రూ.2.58 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అత్యవసర సమయంలో అండగా నిలుస్తున్న సంక్షేమ పథకమని అన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ సహాయాన్ని పొందాలని సూచించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అవసరమైన ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు, డీసీసీ ఉపాధ్యక్షుడు బుయ్యని శివకుమార్, డీసీసీ కార్యదర్శి కమిటీ సభ్యుడు ఎండి లాయక్, కాంగ్రెస్ నాయకులు గణేష్, గడ్డం స్వాతిక్ రాజేందర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, జక్కుల మల్లేష్ యాదవ్, భాస్కర్ రెడ్డి, ఆలేటి శ్రీనివాస్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!