ePaper
Tuesday, June 23, 2026
ePaper
Homeఎడిటోరియల్సర్కారు బడుల మూసివేతపై మండిపడ్డ ఏఐఎస్ఎఫ్

సర్కారు బడుల మూసివేతపై మండిపడ్డ ఏఐఎస్ఎఫ్

📰 Generate e-Paper Clip

*సర్కారు బడుల మూసివేతపై మండిపడ్డ ఏఐఎస్ఎఫ్*

*విద్యాశాఖ కార్యాలయం ముట్టడితో దద్దరిల్లిన లక్డీకాపూల్*

*ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్*

​నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 22:తెలంగాణలో ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టడమే ధ్యేయంగా, విద్యా రంగంలో పేరుకుపోయిన సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్)తెలంగాణ రాష్ట్ర సమితి సమరశంఖం పూరించింది. ఈరోజు లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యా కార్యాలయం ముందర ఏఐఎస్ఎఫ్ భారీ ధర్నా మరియు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాయి.


​ఈ తీవ్ర నిరసన ప్రదర్శనలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ విద్యార్థి లోకాన్ని ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక విధానాలపై వారు నిప్పులు చెరిగారు​ధర్నా సందర్భంగా విద్యార్థి నేతలు ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లు ఆకాష్ నాయక్ మాట్లాడుతూ.​పాఠశాలల తగ్గింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 27 వేల ప్రభుత్వ పాఠశాలలను కేవలం 4 వేలకు కుదిస్తామంటూ ప్రకటించిన విద్యార్థి వ్యతిరేక నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి
​ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ చేసి సర్కారు బడులను నిర్వీర్యం చేయడం ఆపి, ప్రభుత్వ విద్యారంగాన్ని అన్ని విధాలా బలోపేతం చేయాలని అన్నారు.
​ఫీజుల నియంత్రణ చట్టం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కఠినమైన ‘ఫీజు నియంత్రణ చట్టాన్ని’ తీసుకురావాలి.
​ఉచిత విద్యా హక్కు అమలు చేయాలి విద్యా హక్కు చట్టం – 2009 ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించి, వారికి ఉచిత విద్యను అందించాలి.
అనంతరం విద్యార్థి నేతల అరెస్ట్
తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఏఐఎస్ఎఫ్ తెలంగాణ సమితి సభ్యుడు ఆకాష్ నాయక్‌తో పాటు పలువురు విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నాయకులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
​అరెస్టులు, పోలీసుల లాఠీలకు భయపడే ప్రసక్తే లేదని, పేద విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మరియు ప్రభుత్వ విద్యను కాపాడుకునేంత వరకు AISF పోరాట పంథా ఆగేది లేదని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!