అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

జగద్గిరిగుట్టలో శ్రీ వైష్ణవి దుర్గ దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ విప్
ప్రజల సుఖసంతోషాలు, శాంతి కోసం ప్రార్థనలు
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు, స్థానిక నాయకులు
జగద్గిరిగుట్ట, జూన్ 21 (నమస్తే భారత్):
జగద్గిరిగుట్ట నియోజకవర్గంలోని 126వ డివిజన్ సీసల బస్తీలో ఉన్న శ్రీ వైష్ణవి దుర్గ దేవాలయంలో జై గురు నవదుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్, జగద్గిరిగుట్ట ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, శ్రీ వైష్ణవి దుర్గ అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై సంపూర్ణంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సేవాసమితి సభ్యులు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించారు. భక్తి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్, డివిజన్ అధ్యక్షుడు రుద్రా అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, జై గురు నవదుర్గ సేవాసమితి ట్రస్ట్ సభ్యులు శ్రీకాంతాచార్యులు, జైహింద్, రాఘవేందర్, కపిరాజు, రంగనాథ్, కర్ణ, నాయకులు మల్లేష్ గౌడ్, పాపిరెడ్డి, విటల్ ముదిరాజ్, బ్రహ్మానంద చారి, దాసు, రమేష్, ప్రభాకర్, మెట్ల శీను, విఘ్నేష్, ముంతాజ్, సంతోష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.



