ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeఎడిటోరియల్అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న భరత్ సింహ రెడ్డి

అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న భరత్ సింహ రెడ్డి

📰 Generate e-Paper Clip

అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న భరత్ సింహ రెడ్డి

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుదల
ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలి
సుచిత్రలో టీఎన్ఆర్ అపార్ట్‌మెంట్ క్లబ్‌హౌస్‌లో యోగ సాధన
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
కుత్బుల్లాపూర్, జూన్ 21 (నమస్తే భరత్ ): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధిలోని సుచిత్ర ప్రాంతంలోని టీఎన్ఆర్ అపార్ట్‌మెంట్ క్లబ్‌హౌస్‌లో నిర్వహించిన యోగ సాధన కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానమని పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. యోగాను క్రమం తప్పకుండా ఆచరించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అపార్ట్‌మెంట్ నివాసులు, యోగా శిక్షకులు, మహిళలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!