కేసీఆర్ చెప్పేవరకు లక్ష్మీదేవి పల్లె ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ కు తెలుసా?
90 శాతం పనులు పూర్తయిన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం హాస్యాస్పదం
నాడు లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నేతలు, నేడు ఆ ప్రాజెక్టును కడ్తామని చెప్పుతున్నారు
రైతుబంధు పథకాన్ని పూర్తిస్థాయిలో నీరుగార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా?
కాంగ్రెస్ ఇస్తామన్న తులం బంగారం ఎక్కడికి పాయే?
కేసీఆర్ పాలనలో రైతులు, సకలజనులు సంతోషంగా ఉన్నారు
సభ్యత్వ నమోదులో పార్టీ శ్రేణులు ఆసక్తిగా పాల్గొనాలి
SIR ఓటర్ జాబితా సవరణపై ప్రతి కార్యకర్తబీఅప్రమత్తంగా ఉండాలి
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
షాద్ నగర్ కుంట్ల రాం రెడ్డి గార్డెన్ లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగాపాల్గొన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, సభ్యత్వ నమోదు ఇంచార్జ్ బైకని శ్రీనివాస్ యాదవ్

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్17:కేసీఆర్ పాలనలో సకలజనులు సంతోషంగా ఉన్నారని , రైతుల శ్రేయసే లక్ష్యంగా ఎన్నో రిజర్వాయర్లు నిర్మించి బీడు భూములకు సాగునీళ్లు అందించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. SIR అవగాహన, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా షాద్ నగర్ పట్టణంలోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి , సభ్యత్వ నమోదు ఇంచార్జ్ బైకని శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి మాట్లాడారు. పాలమూరు ప్రజల శ్రేయస్సు కోసం నాటి సీఎం కేసీఆర్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఐదు ప్రధాన రిజర్వాయర్లను నిర్మించి 90 శాతం మేర పనులు పూర్తి చేస్తే, పనులు చేయలేదంటూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. కేసీఆర్ చెప్పేంతవరకు లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు కట్టాలని సోయి కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? ఆ ప్రాంతం పేరు అయినా తెలుసా? అంటూ విమర్శించారు. లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆనాటి కాంగ్రెస్ నేతలు నేడు ప్రాజెక్టు కడతామని చెప్పడం విడ్డూరంగా ఉందని, నిజంగానే రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే పూర్తి చేసి పాలమూరు జిల్లా రైతులకు సాగునీరు అందించాలని సవాలు విసిరారు. కేసీఆర్ పాలనలో సకలజనులు సంతోషంగా ఉన్నారని,అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని,ఇందులో భాగంగానే రైతుల బాగు కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి పెట్టుబడి సహాయం అందిస్తే,నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును నీరుగార్చి రైతులను హరిగోస పెడుతుందని తీవ్రస్థాయిలో విమర్శించారు. సకాలంలో రైతుబంధు నిధులు వేయకుండా రైతులను ఇబ్బందుల గురి చేస్తుందని, వర్షాకాలం ప్రారంభమైన నేటికి రైతుబంధులు ఇవ్వలేదని మండిపడ్డారు. నాటి కేసీఆర్ పేద ప్రజల పెళ్లిల కోసం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రవేశపెట్టి యువతులకు నిధులు అందజేస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం నిధులను కూడా సక్రమంగా ఇవ్వలేకపోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న తులం బంగారం ఎక్కడ పోయిందని ఎద్దేవా చేశారు . అన్ని వర్గాల ప్రజలు మరో మరో కేసీఆర్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని గుర్తు చేశారు . అదేవిధంగా ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు వచ్చే బీఎల్వోల తో బూతు స్థాయి కార్యకర్తలను సమన్వయం చేసుకొని దొంగ ఓట్లను తొలగించాలని, అసలైన ఓట్లను నమోదు చేయాలని సూచించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సభ్యత నమోదు కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని, అన్ని వర్గాల కార్యకర్తలు నాయకులు పార్టీ సభ్యత్వ నమోదులో ఉత్సాహంగా పాల్గొని రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదును చేయాలని సూచించారు. డిజిటల్ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త సభ్యత్వం తీసుకునే ప్రతి వ్యక్తి ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ప్రత్యేకంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణి దేవి, సభ్యత్వ నమోదు ఇంచార్జీ బైకని శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎస్సి ఎస్టీ కమీషన్ సభ్యులు రాంబాల్ నాయక్, మాజీ సహకార కార్పొరేషన్ చైర్మన్ రాజవరప్రసాద్, మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి, మాజీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు జిల్లెల వెంకట్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మున్సిపల్ చైర్మన్లు నరేందర్, లావణ్య దేవేందర్ యాదవ్, పీఎసీఎస్ చైర్మన్ జగదీశ్వర్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు నటరాజన్, శ్రీధర్ రెడ్డి, లక్ష్మణ్ నాయక్, హఫీజ్, పద్మా రెడ్డి, మురళీధర్ రెడ్డి, మెండే కృష్ణ, మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ పీఎసీఎస్ చైర్మన్లు, మాజీ లైబ్రరీ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఎజెంట్లు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

