అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
నమస్తే భారత్ :-తొర్రూరు
అంగన్వాడీ కేంద్రాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని 7వ వార్డు కౌన్సిలర్ మాడుగుల భవానీ లత అన్నారు. శుక్రవారం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తొలి ముద్ద’ (ఆరోగ్య లక్ష్మి) కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పౌష్టికాహారమైన ఉదయం బ్రేక్ఫాస్ట్ (ఉప్మా, కిచిడీ మిశ్రమం) ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భవాని లత మాట్లాడుతూ.పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు పౌష్టికాహారాలు తీసుకోవాలన్నారు.అంగన్వాడి కేంద్రాలలో అందించే పౌష్టికాహారాలను తీసుకోవాలన్నారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదల, పోషకాహార లోపం, నివారణ శారీరక, మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు అంగన్వాడీ టీచర్ పద్మ, 3వ వార్డు అంగన్వాడీ టీచర్ విజయ, వార్డు మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.



