ePaper
Friday, November 6, 2026
ePaper
Homeతెలంగాణమరిపెడ పట్టణ ప్రజలకు దీపావళి కానుకగా ఇంటి పన్నులపై 40 శాతం తగ్గింపు

మరిపెడ పట్టణ ప్రజలకు దీపావళి కానుకగా ఇంటి పన్నులపై 40 శాతం తగ్గింపు

📰 Generate e-Paper Clip

మరిపెడ పట్టణ ప్రజలకు దీపావళి కానుకగా ఇంటి పన్నులపై 40 శాతం తగ్గింపు

ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం.. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న పట్టణ ప్రజలు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో అధిక ఇంటి పన్నులు పట్టణ ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రు నాయక్ ప్రత్యేక కృషితో ఇంటి పన్నులపై 40 శాతం తగ్గింపు లభించడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దీపావళి పండుగ సందర్భంగా పట్టణ ప్రజలకు ఈ తగ్గింపు ఒక కానుకగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మరిపెడ పట్టణంలో ప్రజలు, వ్యాపారవర్గాల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రు నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంటి పన్నుల తగ్గింపునకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులను వ్యాపారవర్గాల ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. పట్టణ ప్రజలకు ఊరట కలిగించేలా ఇంటి పన్నుల తగ్గింపు విషయంలో సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!