మచ్చలేని ఝాన్సీ రెడ్డి పై బురద చల్లితే ఊరుకోం.
ఝాన్సీ రెడ్డిపై ప్రతిపక్షాల ఆరోపణలు సరికాదు
నమస్తే భారత్ :-తొర్రూరు
పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిపై ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కోవర్టులు ఆరోపణలు చేయడం సరికాదని మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి, పట్టణ అధ్యక్షుడు ముద్ధసాని సురేష్ లు విమర్శించారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు రాజకీయాల్లో రాకముందే తొర్రూరు డివిజన్ కేంద్రంలో కోట రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించారని, పాలకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని, ఝాన్సీ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి దయాకర్ రావు కోవర్టులు దుష్ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. సోషల్ మీడియా,ఇతర పత్రికలలో వచ్చే కథనాలను పాలకుర్తి ప్రజలు నమ్మరని అన్నారు.ఇప్పటికైనా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పై చేస్తున్న ఆరోపణలను మానుకోవాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బచ్చలి లక్ష్మణ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు వల్లపు యాకయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు అజ్మీర రమేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిత్తలూరు శ్రీనివాస్, చెవిటి సదాకర్ జాటోత్.రవి.నాయక్ ,సోమవారం ఐలయ్య,ఎనగందుల శ్రీనివాస్, జాటోత్ సురేష్, దొంగరి శంకర్, వివిధ గ్రామాల సర్పంచులు పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు



