ఎల్ ని నో ప్రభావం పై తట్టుపల్లిలో అవగాహన కార్యక్రమం.
నమస్తే భరత్ నవంబర్ 11 కురవి:
కురవి మండలం తట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్ ని నో ప్రభావం పై మరియు పరిసరాల పరిశుభ్రత, సంక్షేమ పథకాలు గూర్చి ప్రజలను చైతన్యం పరిచే విధంగా తెలంగాణ సాంస్కృతిక సారథి మిట్టగడుపుల భరత్ కుమార్ కళా బృందం కొమిరె వెంకన్న, బండ వెంకన్న, జబర్దస్త్ రాజమౌళి,డప్పు శ్రీను, జిన్నా, అశ్విని,కవిత, సింధు, పాషా కళాజాతర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రావణి , మంగీలాల్, గ్రామస్తులు పాల్గొన్నారు.



