ePaper
Friday, November 6, 2026
ePaper
Homeతెలంగాణఫతేపురం గ్రామంలో వీసీపీసీ కమిటీ ఏర్పాటు

ఫతేపురం గ్రామంలో వీసీపీసీ కమిటీ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

ఫతేపురం గ్రామంలో వీసీపీసీ కమిటీ ఏర్పాటు

నమస్తే భారత్ :-తొర్రూరు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మాటేడు సెక్టార్ పరిధిలో ఉన్న ఫతేపురం గ్రామపంచాయతీలో వీసీపీసీ (విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ) కమిటీని ఏర్పాటు చేశారు.తొర్రూరు ప్రాజెక్ట్ ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నాగమణి పర్యవేక్షణలో ఈ కమిటీ ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ, బాలల భద్రత, బాల్యవివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలపై జరిగే వేధింపులను అరికట్టడం వంటి అంశాలపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు.
గ్రామంలో బాలల సమస్యలను గుర్తించి, వారికి రక్షణ కల్పించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో సంబంధిత శాఖల సహకారంతో తగిన చర్యలు తీసుకోవడంలో వీసీపీసీ కమిటీ కీలక పాత్ర పోషించాలని సూచించారు. బాలల హక్కులను కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాధవరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, వీవో సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!