ePaper
Saturday, November 7, 2026
ePaper
Homeతెలంగాణషాద్‌నగర్ అభివృద్ధికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవ

షాద్‌నగర్ అభివృద్ధికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవ

📰 Generate e-Paper Clip

షాద్‌నగర్ అభివృద్ధికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవ

రూ.1.27 కోట్లతో ఆరవ వార్డులో అత్యాధునిక సేవాలాల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం

నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న కౌన్సిలర్ డి.రాజు నాయక్, కోఆప్షన్ సభ్యురాలు లతాశ్రీ శ్రీశైలం గౌడ

నమస్తే భారత్ షాద్‌నగర్,నవంబర్,05: షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవ తీసుకుంటూ అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారం, మార్గదర్శకత్వంలో షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో సుమారు రూ.1 కోటి 27 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సేవాలాల్ కమ్యూనిటీ హాల్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో పటిష్టంగా ఉండేలా ఆరవ వార్డు కౌన్సిలర్ బి. రాజు నాయక్ ఎమ్మెల్యే ఆదేశాలకు అనుగుణంగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు నాణ్యతతో పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్, ప్రస్తుత కోఆప్షన్ సభ్యురాలు శ్రీమతి పులిమామిడి లతాశ్రీ శ్రీశైలం గౌడ్ సైతం నిర్మాణ పనుల పర్యవేక్షణలో చురుకుగా పాల్గొంటూ తన వంతు సహకారం అందిస్తున్నారు.డబుల్ మ్యాటింగ్‌తో పాటు అనుభవజ్ఞులైన ఇంజనీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు జరుగుతుండటం విశేషం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాలంగా, అన్ని వసతులతో నిర్మిస్తున్న ఈ సేవాలాల్ కమ్యూనిటీ హాల్ పూర్తయితే షాద్‌నగర్ నియోజకవర్గానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు రాష్ట్రంలోనే అతిపెద్ద కమ్యూనిటీ హాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.అభివృద్ధికి చిరునామాగా షాద్‌నగర్ కేవలం కమ్యూనిటీ హాల్ నిర్మాణమే కాకుండా నియోజకవర్గంలో దేవాలయాలు, విద్యాలయాలు, రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా, ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటుండటంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లడంలో కౌన్సిలర్ రాజు నాయక్, కోఆప్షన్ సభ్యురాలు లతాశ్రీ శ్రీశైలం గౌడ్ చేస్తున్న కృషి అభినందనీయమని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయంతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడం వల్లే పనుల్లో వేగం పెరుగుతోందని అభిప్రాయపడుతున్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు, ఆయన మార్గదర్శకత్వంలో క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న కౌన్సిలర్ డి.రాజు నాయక్, కోఆప్షన్ సభ్యురాలు లతాశ్రీ శ్రీశైలం గౌడ్‌లకు ఆరవ వార్డు ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!