ePaper
Thursday, November 5, 2026
ePaper
Homeతెలంగాణరెడ్డిగణపవరం బ్రిడ్జి వరదలో చిక్కుకున్న 22 మంది యువకులు సురక్షితం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవతో...

రెడ్డిగణపవరం బ్రిడ్జి వరదలో చిక్కుకున్న 22 మంది యువకులు సురక్షితం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవతో రక్షణ చర్యలు

📰 Generate e-Paper Clip

రెడ్డిగణపవరం బ్రిడ్జి వరదలో చిక్కుకున్న 22 మంది యువకులు సురక్షితం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవతో రక్షణ చర్యలు

నమస్తే భారత్ నవంబరు 5( ప్రేమ్ కిరణ్)

విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే.సుమారు 6 గంటలు పాటు ఘటనా ప్రదేశం లో ఉన్న ఎమ్మెల్యే. జీలుగుమిల్లి – బుట్టాయిగూడెం మండలాల సరిహద్దులో ఉన్న రెడ్డిగణపవరం బ్రిడ్జి వద్ద భారీ వరద ప్రవాహంలో బుధవారం రాత్రి చిక్కుకున్న 22 మంది యువకులను సురక్షితంగా బయటకు తరలించేందుకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవ తీసుకున్నారు. వరద ఉధృతిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. వాగు మధ్యలో చెట్లపై ఆశ్రయం పొందుతున్న ఇద్దరిని గురువారం తెల్లవారుజామున సుమారు గంటల ప్రాంతంలో ఎన్ డి ఆర్ ఎస్ బృందం ప్రత్యేక చర్యలు చేపట్టి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.ఆపద సమయంలో తమ కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు త్వరితగతిన స్పందించి సహాయక చర్యలకు చొరవ చూపినందుకు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేపట్టిన సహాయక చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు.వరదలో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ సహాయక చర్యల్లో కూటమి నాయకులు కొప్పుల శ్రీకాంత్, బండారు అనిల్, సొంటి రామకృష్ణ గ్రామస్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!