కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ రాస్తారోకో
శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
ఖానాపురం, అక్టోబర్ 29 (మల్లేష్ నమస్తే భారత్) :
సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఎల్నినో ప్రభావంతో ఖానాపురం మండలంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో 365 జాతీయ రహదారిపై, నర్సంపేట నుంచి భద్రాచలం వెళ్లే మార్గంలో ఖానాపురంలో రెడ్డి పెద్ద రంగారెడ్డి గార్డెన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోకు శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎన్నికల నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి హాజరై మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఖానాపురం మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించేలా పోరాడుతానని హామీ ఇచ్చారు. రైతుల పంటలు ఎండిపోతున్న పరిస్థితిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, రైతులకు న్యాయం చేసేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనరసయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కోరే సుధాకర్, జిల్లా నాయకుడు వల్లెపు శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈకార్యక్రమంలో వివిధగ్రామాల బీఆర్ ఎస్ నాయకులు , బీఆర్ ఎస్ సర్పంచ్ లు పాల్గోన్నారు.



