ePaper
Friday, October 30, 2026
ePaper
Homeతెలంగాణబీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు సమిష్టి కృషి

బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు సమిష్టి కృషి

📰 Generate e-Paper Clip

బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు సమిష్టి కృషి

:ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి

ఖానాపురం, అక్టోబర్ 29 (మల్లేష్ నమస్తే భారత్):
వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఖానాపురం మండల కేంద్రంలోని రెడ్డి పెద్ద రంగారెడ్డి గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమానికి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల క్లస్టర్ ఇన్‌చార్జులు, ఇతర బాధ్యులతో సమావేశం నిర్వహించి ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షించారు. నవంబర్ 6వ తేదీలోపు అర్హులైన పట్టభద్రులందరి ఓటరు నమోదును పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయమని, ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని అన్నారు. నియోజకవర్గ ప్రజలు, రైతులు, నాయకులు, కార్యకర్తల కష్టసుఖాల్లో తాను పాలుపంచుకుంటానని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.అనంతరం మండల, గ్రామ స్థాయి క్లస్టర్ ఇన్‌చార్జులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఓటరు నమోదు పురోగతిని సమీక్షించారు. అర్హులైన పట్టభద్రులను గుర్తించి, నిర్ణీత గడువులోగా నమోదు ప్రక్రియను పూర్తి చేసేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు కోరే సుధాకర్, జిల్లా నాయకుడు వల్లెపు శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్, వివిద గ్రామాల బీఆర్ ఎస్ సర్పంచ్ లు, ఉపసర్పంచులు భూషబోయిన రాజు యాదవ్, సింగ్ సుధాకర్, గుండ్లపల్లి విజయ్, మహమ్మద్ అజహార్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!