4వ వార్డులో సైడ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 4వ వార్డులో కొనసాగుతున్న సైడ్ డ్రైనేజీ పనులను గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, డ్రైనేజీ నిర్మాణ పనుల వివరాలను సంబంధిత నాయకులతో చర్చించారు.
పట్టణంలోని వార్డుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న డ్రైనేజీ పనులను నాణ్యతతో పూర్తి చేయడంపై దృష్టి సారించారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉంటే మురుగునీటి సమస్యలు తగ్గడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు.దోహదపడుతుందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము, కో-ఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్న, మాజీ టౌన్ ప్రెసిడెంట్ షేక్ తాజోద్దిన్, అనంతగిరి రవి, గుంటి రవి, రామగిరి సత్యనారాయణ, నవీన్, లింగయ్య, చారి తదితరులు పాల్గొన్నారు.



