ePaper
Friday, October 30, 2026
ePaper
Homeతెలంగాణన్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు

న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు

📰 Generate e-Paper Clip

న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు

ఖానాపురం, అక్టోబర్ 29(మల్లేష్ నమస్తే భారత్) : విద్యార్థులు చిన్న వయస్సు నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, తమ హక్కులతోపాటు బాధ్యతలను కూడా తెలుసుకోవాలని న్యాయవాదులు సూచించారు.

సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ కస్తూర్బా పాఠశాల, సైనిక్ స్కూల్‌లో నర్సంపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సునీత, సాంబయ్య, రమేష్ పాల్గొని విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, పౌరుల విధులు, బాలల హక్కులు, విద్యాహక్కు చట్టం, బాల్యవివాహాల నిరోధం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, మహిళలు, బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలు, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉచిత న్యాయసహాయం తదితర అంశాలను వివరించారు.చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల అనేకమంది తమ హక్కులను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారని న్యాయవాదులు పేర్కొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం, చట్టాలను గౌరవించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఎవరైనా అన్యాయానికి గురైనప్పుడు భయపడకుండా సంబంధిత అధికారులను సంప్రదించాలని, అర్హులైన వారికి న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయసహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా కస్తూర్బా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేనక, సైనిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సురేందర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో న్యాయపరమైన అవగాహన, సామాజిక బాధ్యత, క్రమశిక్షణను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో పాఠశాల విద్యతోపాటు రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించడం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సునీత, సాంబయ్య, రమేష్, ప్రధానోపాధ్యాయురాలు మేనక, సైనిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సురేందర్, ఉపాధ్యాయ బృందం, ఎస్ ఐ గుగులోత్ రామ్మోహన్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!