ePaper
Saturday, October 31, 2026
ePaper
Homeతెలంగాణఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

📰 Generate e-Paper Clip

ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

ఖానాపురం అక్టోబర్ 29 (మల్లేష్ నమస్తే భారత్) : ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులు, వ్యవసాయ కార్మికులు, భూమిలేని పేదలు, నిరుపేదలను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ నాయకులు భూక్య సమ్మయ్య, ముంజాల సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఖానాపురం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖానాపురం మండలంలో గిరిజనులు, పేదలు అధిక సంఖ్యలో ఉన్నారని, సాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో రైతులు వేసిన పంటలు ఎండిపోయాయని తెలిపారు. చాలామంది రైతులు పంటలు వేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోవడం వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.వ్యవసాయ పనులు లేక వ్యవసాయ కార్మికులు, భూమిలేని పేదలు జీవనోపాధి కోల్పోతున్నారని, భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు తదితర వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితులను ప్రభుత్వం గుర్తించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
ఖానాపురం మండలానికి సాగునీరు అందించేందుకు ఉన్న ప్రాజెక్టుల వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఖానాపురం మండలంలోని చాలా గ్రామాలకు ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీరు అందడం లేదని, పాకాల నీటిపై ఆధారపడే కొద్దిమంది రైతులకు మాత్రమే ప్రయోజనం కలుగుతోందన్నారు. ఖానాపురంమండలంలోని మెజారిటీ రైతాంగం సాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకాల నీటిని ఇతర ప్రాంతాల సాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారని, ఖానాపురం మండల రైతుల ప్రయోజనాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖానాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, రైతులు, వ్యవసాయ కూలీలు, భూమిలేని పేదలకు తగిన సహాయం అందించి వలసలను నివారించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు ముంజాల రమేష్, గొట్టం కుమార్, కొత్తపల్లి రాజేందర్, గాదరి మల్లయ్య, మన్నూరు సుధాకర్, ఎల్జీ శ్రీను, పిండి ఉమేష్, మొద్దు సాంబయ్య, ఎలేందర్, రావుకోల రవి, స్టాలిన్, శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!