ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeఎడిటోరియల్ఉత్తమ అవార్డు అందుకున్న ఖానాపురం తహాశీల్థార్

ఉత్తమ అవార్డు అందుకున్న ఖానాపురం తహాశీల్థార్

📰 Generate e-Paper Clip

ఉత్తమ అవార్డు అందుకున్న ఖానాపురం తహాశీల్థార్

ఖానాపురం, ఆగస్టు 15 (నమస్తే భారత్ ):

విధి నిర్వహాణలో అంకిత భావంతో పని చేస్తూ ప్రజలకు సేవలను అందిస్తున్న వివిధ శాఖల అధికారులను ప్రభుత్వం గుర్తించి ఖిలా వరంగల్ నందు నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలొ భాగంగా ఖానాపురం మండలంలో పని చేస్తున్న పలువురు అధికారులు దేవాదాయ శాఖ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డిసిపి అంకిత్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు ప్రశంస పత్రం అందుకున్నారు.
ఖానాపురం తహాశీల్థార్ నంగునూరి రమేష్, ఖానాపురం, నల్లబెల్లి మండలాల ఇంటలిజెన్స్ ఫీల్డ్ ఆఫీసర్ లింగంపల్లి కుమార్, అయోధ్య నగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మాలతి, ఐటీడీఏ పరిధి ఉపాధ్యాయురాలు సౌజన్యలు ఉత్తమ అవార్డు ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ అవార్డు అందుకున్న అధికారులను పలువురు ప్రశంసించారు.

*తహాశీల్దార్ ను సన్మానించిన కార్యాలయ సిబ్బంది* :

ఉత్తమ అవార్డు అందుకున్న తహాశీల్దార్ నంగునూరి రమేష్ ను ఖానాపురం తహాశీల్థార్ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహాశీల్దార్ రాజారేణుక, ఆర్ ఐ స్వామి, ఎమ్మారై గాయత్రీ, ఎస్ ఓ సుగుణ, సీనియర్ అసిస్టెంట్ వంశీ జోహార్, జూనియర్ అసిస్టెంట్, జిపిఓలు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!